ఎండాకాలం వచ్చేస్తుంది.. ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలలో ఎండలు ఏ రేంజ్ లో మండిపోతాయో అని ప్రజలు బయపడిపోతున్నారు. ఎండవేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండాకాలం సరైనా జాగ్రత్తలు తీసుకోకుంటే తిప్పలు తప్పవంటున్నారు డాక్టర్లు. ఎండ వేడికి డీహైడ్రేషన్, విరేచనాలు, చమటకాయలతో బాధపడతారు.
వేడిని తట్టుకునేందుకు కొన్ని జాగ్రత్తలు:
రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి. ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్, గ్లౌజ్‌లు వాడాలి. తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండేవిధంగా చూసుకోవాలి. వేసవిలో దాహార్తిని తీర్చే చల్లటి నీరు, కొబ్బరి బొండాలతో పాటు మజ్జిగ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చర్మం బాగా పొడిబారిపోయినప్పుడు సబ్బుతో ఎక్కువ సార్లు కడుక్కోవద్దు. దీనికి బదులుగా వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోండి. విలువైన పోషకాలుండే కీరదోస, క్యారట్, బీట్‌రూట్, పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా తీసుకోండి. దీనివల్ల దేహంలోని వేడి తగ్గడంతోపాటు విలువైన పోషకాలు లభిస్తాయి. చర్మం తాజాగా ఉంటుంది.
ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎండలోకి తప్పనిసరిగా వెళ్లేవారు సన్‌స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండేవిధంగా చూసుకోవాలి. రోజు రెండుసార్లు స్నానం చేయాలి. బిర్యానీలు, మాంసాహారం, శరీరానికి వేడి చేసే మసాల దినుసులు, కారం ఎక్కువగా ఉండే పచ్చళ్ళు, వేపుడు పదార్ధాలు తినకూడదు. నూనే తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిది. అన్నం తిన్నాక చివరలో తప్పక మజ్జిగ అన్నం తినాలి. ఎక్కువ వేడి చేసిన వారు రోజు మూడు టీ స్పూన్‌ల సబ్జా గింజలను నానబెట్టుకుని తాగాలి. క్రమం తప్పకుండా త్రాగితే మంచి ఫలితాలు వస్తాయి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని నీడ ప్రదేశానికి తీసుకువచ్చి చల్లని నీటిలో ముంచిన గుడ్డతో శరీరాన్ని తుడవాలి. శరీర ఉష్ణగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు చూడాలి. వడదెబ్బ తగిలి ఆపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించకూడదు. వీలైనంత తొందరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. చిన్న పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులు, రోజువారీ కూలీలు, ఎక్కువగా బయట పనిచేసేవారికి వడదెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. అలాంటి వారి వేసవి కాలంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆహార నియమాల నుంచి నిద్ర వరకు వైద్యుల సలహాలు పాటించాలి. వేసవిలో ఎక్కువగా స్విమ్మింగ్ చేయడం చాలా మందికి అలవాటు. అయితే స్విమ్మింగ్ ఎక్కువ సమయం చేయడంవల్ల నీళ్లలో ఉండే క్లోరిన్ కేశ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. కనుక స్విమ్మింగ్ చేసేటప్పుడు తప్పకుండా తలకు మాస్క్ ధరించడం మరచిపోవద్దు. వేసవికాలంలో భయటకి వెళ్ళేటపుడు మీతో వాటర్ బాటిల్’ను తీసుకెళ్ళండి. వేసవికాలంలో ఆల్కహాల్, సిగరెట్, కెఫీన్ వంటి వాటికి దూరంగా ఉండండి. వేసవికాలంలో డోకులు, వాంతులు, అలసట, బలహీనంగా కనిపించటం, తలనొప్పి, కండరాలలో తిమ్మిరులు, మైకం వంటి లక్షణాలు బహిర్గతమైన వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స చేపించుకోవటం చాలా మంచిది. రాబోయే రెండు నెలలు ఎండలు మరింత పెరిగిపోయే అవకాశం ఉంది. వేసవి కాలంలో చాలా వరకు మనల్ని మనమే రక్షించుకోవాలి.