బాలకృష్ణకు దూరంగా ఎన్టీఆర్.. స్వర్ణోత్సవానికి డుమ్మా..!

నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని పునస్కరించుకుని నేడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆయనకు ఘన సన్మానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు సినీ పరిశ్రమకు సంబందించిన మహామహులు అంతా కూడా అటెండ్ అవుతున్నారు. హీరోల్లో చిరంజీవి, అల్లు అర్జున్, సాయి ధరం తేజ్, వెంకటేష్, నాగార్జున, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి హీరోలు అటెండ్ అవుతున్నారని తెలుస్తుంది.

ఐతే బాలయ్య స్వర్ణోత్సవ ఉత్సవాలకు నందమూరి హీరోలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. కళ్యాణ్ రాం ఏమైనా చివరి నిమిషంలో అటెండ్ అవుతారేమో కానీ తారక్ మాత్రం ఈ ఈవెంట్ కి వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తుంది. బాలకృష్ణకు దూరంగా ఎన్టీఆర్ ఉండటం అంత శ్రేయష్కరం కాదు. ఇది నందమూరి ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు.

ఎన్టీఆర్ సినిమాల మీద ఈ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి. అంతకుముందు అన్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు కూడా Jr ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు. ఇలా నందమూరి ఫ్యామిలీకి అది కూడా సినీ సెలబ్రిటీస్ అంతా కూడా అటెండ్ అవుతున్న వేళ తారక్ దూరంగా ఉండటం కొంతమంది నందమూరి ఫ్యాన్స్ ని బాధ పెడుతుంది.

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈమధ్యనే ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ కి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాడు. ఎన్టీఆర్ దేవర 1 ఈ నెల చివరన రిలీజ్ అవుతుంది. నందమూరి ఫ్యాన్స్ అంతా ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఐతే ఎన్టీఆర్ మాత్రం ఈసారి ఫ్యన్స్ కి సూపర్ ట్రీట్ ఇవ్వడం పక్కా అని చాలా నమ్మకంగా చెబుతున్నారు.

Leave a Reply

*