న్యాచురల్ స్టార్ నాని మరో 3 రోజుల్లో సరిపోదా శనివారం సినిమాతో రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ ఫిమేల్ లీడ్ గా నటించింది. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాకు జేక్స్ బి జోయ్ మ్యూజిక్ అందించారు. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న రెండు సూపర్ హిట్లతో నాని సత్తా చాటగా సరిపోదా శనివారం తో మరో సూపర్ హిట్ కోసం వస్తున్నాడు.
సినిమా ట్రైలర్ చూస్తే అది జరిగి తీరుతుందని అనిపిస్తుంది. ఐతే నాని సినిమా రిలీజ్ ముందు చేసే ప్రమోషన్స్ చూసి అందరు ఫిదా అవుతున్నారు. హీరోగా తన కాల్ షీట్ లో షూటింగ్ పూర్తి చేసి ఏదో రిలీజ్ ముందు ఒకటి రెండు ఇంటర్వ్యూస్ చేసి మమా అనిపించొచ్చు. కానీ అందరి హీరోల్లా నాని అలా కాకుండా ఇది నా సినిమా నేను ప్రమోట్ చేయాలని చేస్తాడు.
సినిమా రిలీజ్ అయ్యే అన్ని భాషల్లో ఇంటర్వ్యూస్ ఇస్తూ సినిమాకు కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తాడు. మామూలుగా సినిమా ప్రమోట్ చేయడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా అని మనం అంటుంటాం. డైరెక్టర్స్ లో రాజమౌళి అయితే అలా తన సినిమాను ప్రమోట్ చేయడంలో నాని తర్వాతే ఎవరైనా.
సరిపోదా శనివారం కోసం నాని డే అండ్ నైట్ షూట్ చేయడమే కాదు ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు. నాని పెడుతున్న ఈ శ్రమకు కచ్చితంగా తగిన ఫలితం వస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే సరిపోదా శనివారం లో నాని ఫ్యాన్స్ కి మాస్ స్టఫ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి. నాని మాత్రం రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక బస్తా పేపర్లు ఎక్కువే తీసుకెళ్లండి అనే మాస్ కామెంట్ తో ఫ్యాన్స్ లో జోష్ పెంచాడు.