నాని తో సరిపోదా శనివారం సినిమాలో విలన్ గా నటించిన ఎస్ జే సూర్య ఒకప్పుడు డైరెక్టర్ అన్న విషయం ఎంతమందికి తెలుసో కానీ ఆయన డైరెక్షన్ లో మన స్టార్స్ సినిమాలు చేశారన్న విషయం మాత్రం తెలుసుకోవాల్సిందే. ఎస్ జే సూర్య డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్ టైం సూపర్ హిట్ మూవీ ఖుషి చేయగా ఆ తర్వాత మహేష్ తో నాని సినిమా చేశారు. ఖుషి సినిమా రీమేకే అయినా తెలుగులో బంపర్ హిట్ కొట్టింది.
ఐతే సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో ఎస్ జే సూర్యను ఖుషి 2 గురించి పదే పడే అడుగుతున్నారు. ఖుషి సూపర్ హిట్ అవ్వడంతో ఖుషి 2 కథతో పవన్ కళ్యాణ్ ని కలిశాడట సూర్య కానీ ఆ టైం కు పవన్ ఇక లవ్ స్టోరీస్ చేయకూడదు అనుకున్నా అని కథ బాగున్నా వద్దనేశారట. ఐతే ఈ విషయం తెలిసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి 2 కథను జూనియర్ పవర్ స్టార్ అదే అకిరా నందన్ తో చేసేయండి అని హడావిడి చేస్తున్నారు.
ఖుషి సినిమా తండ్రి చేస్తే ఖుషి 2 సినిమాను కొడుకు చేస్తే పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. ఐతే అది జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే ఖుషి 2 అకిరా నందన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది ఎస్ జే సూర్య డైరెక్షన్ లో వస్తుందా లేదా వేరే డైరెక్టర్ ఎవరైనా చేస్తారా అన్నది చూడాలి.
అకిరా నందన్ ఎంట్రీ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఐతే అతను మాత్రం మ్యూజిక్ మీద ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నాడు. అకిరా నంద హీరో అయితే మాత్రం ఆల్రెడీ ఫ్యాన్స్ అతన్ని స్టార్ ని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.