Allu Arjun : అల్లు అర్జున్.. అట్లీ.. ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఎవరితో సినిమా చేస్తాడన్న కన్ ఫ్యూజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. త్రివిక్రం తో అల్లు అర్జున్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినా గురూజీ ఇప్పుడప్పుడే నెక్స్ట్ సినిమా ప్లానింగ్ కష్టమని అంటున్నాడట. అందుకే అల్లు అర్జున్ మరో డైరెక్టర్ కోసం వెతుకుతున్నాడు. ఐతే జవాన్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా చేయాలని అనుకున్నా అది కుదరలేదు. ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగినా బడ్జెట్ రెమ్యునరేషన్ లెక్కల్లో తేడా రావడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నారు.

ఐతే లేటెస్ట్ గా గీతా ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాసు మాటలను బట్టి చూస్తే మళ్లీ అట్లీతో సినిమా చర్చలు మొదలైనట్టు అర్ధమవుతుంది. షారుఖ్ ఖాన్ కి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ గా అట్లీ మీద అల్లు అర్జున్ నమ్మకంగా ఉన్నాడు. అందుకే త్రివిక్రం తో సినిమా ఎప్పుడైనా చేయొచ్చు కానీ అట్లీ మిస్ ఐతే మళ్లీ దొరకడని అతనితో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది.

అల్లు అర్జున్, అట్లీ ఈ కాంబో నిజంగానే ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే. జవాన్ ముందు వరకు తమిళ్ లో భారీ సినిమాలు చేసిన అట్లీ షారుఖ్ తో జవాన్ తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఐతే అల్లు అర్జున్ తో పాన్ ఇండియా సినిమా తీయాలంటే మాత్రం కచ్చితంగా స్టోరీ కూడా ఒక రేంజ్ లో ఉండాలి. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా అల్లు అర్జున్ కి భారీ ఫాలోయింగ్ ఏర్పడగా అందుకు తగినట్టుగానే తన సినిమాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్. అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఫ్యాన్స్ కి మంచి మాస్ ట్రీట్ అందిస్తుందని చెప్పొచ్చు. మరి త్రివిక్రం ని సైడ్ చేసి అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేయడం దాదాపు కన్ ఫర్మ్ అయ్యిందనే చెప్పొచ్చు.

Leave a Reply

*