Another Actor Came from Star Family Manchu AVram Bhakta
అన్ని ఇండస్ట్రీల్లో నెపొటిజం ఉన్నా కూడా సిని పరిశ్రమలో అది ఎక్కువగా కనిపిస్తుంది. హీరో కొడుకు హీరో అవ్వడం ఆ స్టార్ ఫ్యాన్స్ అంతా అతనికి ఫ్యాన్స్ అవ్వడం సపోర్ట్ చేయడం ఇదంతా ఇప్పటి నుంచి జరుగుతున్నది కాదు. ఐతే వారసుడిలో విషయం లేకపోతే ఎంత పెద్ద అభిమాన గణం ఉన్నా దండగే. త్వరలో నందమూరి నట వారసుడిని తెరంగేట్రం చేసే ప్లానింగ్ లో ఉండగా దానికి సంబందించిన చర్చలు జరుగుతున్నాయి.
ఇదిలాఉంటే లేటెస్ట్ గా మరో సినీ నట వారసుడు తెరంగేట్రం చేస్తూ షాక్ ఇచ్చాడు. అతనెవరో కాదు మంచు అవ్రాం భక్త. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మనవడు.. మంచు విష్ణు వారసుడు అవ్రాం భక్త మంచు. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమాలో అవ్రాం కూడా నటిస్తున్నాడు.
ఈ బుడ్డోడు సినిమాలో తిన్నడు క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. దానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అవ్రాం లుక్ అప్పియరెన్స్ అంతా బాగుంది. మంచు విష్ణు కన్నప్పలో అవ్రాం కి మంచి క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. మంచు ఫ్యామిలీ లెగసీని అవ్రాం కొనసాగిస్తాడా లేదా అన్నది కనప్పలో అతని స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అంచనా వేయొచ్చు.
మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ ఇలా చాలా పెద్ద స్టార్స్ ని భాగం చేశాడు. మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న కన్నప్ప సినిమా ప్రమోషనల్ కంటెంట్ పై అయితే విమర్శలు వచ్చాయి.