BiggBoss Season 8 Promo : నేటి నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. ప్రోమోతోనే అంచనాలు పీక్స్..!

బిగ్ బాస్ సీజన్ మొదలవుతుంది అంటే బుల్లితెర ఆడియన్స్ లో ఒక సందడి కనిపిస్తుంది. 7 సీజన్లు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ కు రెడీ అయ్యింది. ఈ సీజన్ ని బిగ్ బాస్ టీం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ సీజన్ 8 మొదలవుతుంది. 14 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ 8 రాబోతుంది. హోస్ట్ నాగార్జున ఎనర్జీ ఈ షోకి ప్లస్ కానుంది.

ఇప్పటికే షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నేడు ఆరంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 8 నుంచి ప్రోమో వదిలారు బిగ్ బాస్ టీం. ఎప్పటిలానే కంటెస్టెంట్స్ ఫేసులు కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డారు. బిగ్ బాస్ 8 ఫస్ట్ ప్రోమో అదిరిపోయింది. చాలా గ్రాండియర్ గా ఈ సీజన్ ఉండబోతుందని తెలుస్తుంది.

తొలి ఎపిసోడ్ తోనే ట్విస్ట్ ఇవ్వడం మొదలు పెట్టాడు బిగ్ బాస్. సీజన్ 8 నేటి ఎపిసోడ్ లో సెలబ్రిటీల సందడి కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. నాని, ప్రియాంక సరిపోదా శనివారం ప్రమోషన్స్ కోసం రాగా.. రానా తను నిర్మిస్తున్న 35 సినిమా ప్రమోషన్స్ కోసం నివేదా థామస్ తో హౌస్ లోకి వచ్చారు.

ఇక చివర్లో డైరెక్టర్ అనీల్ రావిపుడికి ఒక టాస్క్ ఇచ్చి పంపించాడు బిగ్ బాస్. రెండున్నర నిమిషాల ప్రోమోలో బిగ్ బాస్ 8 గ్రాండియర్ ఇంకా సీజన్ ఎలా ఉండబోతుందో చూపించారు. ఈ సీజన్ లిమిట్ లెస్ అంటూ చెబుతున్న నాగార్జున ఎంటర్టైన్మెంట్ కూడా అదే రేంజ్ లో అందిస్తారా లేదా అన్నది చూడాలి.

Leave a Reply

*