న్యాచురల్ స్టార్ నాని ఒక్కో సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. దసరా ముందు వరకు నాని అంటే మన పక్కింటి కుర్రాడిలా ఉంటూ కూల్ ఇమేజ్ తో సత్తా చాటుతూ వచ్చాడు. కానీ దసరా తర్వాత నాని కూడా మాస్ సినిమాలు చేయగలడు మెప్పించగలడని ప్రూవ్ చేశాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని నటించిన దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు అవార్డులు రివార్డులు తెచ్చి పెట్టింది.
ఇక ఆ సినిమా తర్వాత మళ్లీ తన రూట్ లోనే హాయ్ నాన్న అంటూ చేసి అదరగొట్టాడు నాని. ఐతే ఆ సినిమా తర్వాత ప్రస్తుతం సరిపోదా శనివారం అంటూ రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని రాజమౌళితో చేసిన ఈగ గురించి చెప్పాడు. నాని, సమంత జంటగా చేసినె ఈగ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఐతే ఎప్పటి నుంచో రాజమౌళికి ఈగ సీక్వెల్ చేయాలన్న ఆలోచన ఉంది. దానికి రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్టోరీ కూడా సిద్ధం చేశారని టాక్. ఐతే ఆ సినిమాలో నానికి ఛాన్స్ లేదని నాని అవసరం లేడని అన్నాడట రాజమౌళి. డైరెక్ట్ గా నానితోనే ఈ విషయాన్ని చెప్పారట. ఈగ సినిమాలోనే నీ క్యారెక్టర్ ఎండ్ అయ్యిందని సీక్వెల్ లో కేవలం ఈగ మాత్రమే ఉంటుందని అన్నారట.
తన సూపర్ హిట్ సినిమాలో నాని లేకపోవడం కాస్త ఫ్యాన్స్ కి ఇబ్బందిగా అనిపించినా అక్కడ ఈగ ప్రధానం కాబట్టి నాని త్యాగం చేయక తప్పదు. ఐనా ప్రస్తుతం రాజమౌళి మహేష్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా పూర్తయ్యే సరికి ఎలా లేదన్నా ఐదేళ్లు పడుతుంది. ఆ తర్వాత అయినా ఈగ 2 ఉంటుందా లేదా అన్నది చెప్పడం కష్టమే.