ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి మొదటి భాగం కల్కి 2898 ఏడి సినిమాలో కథ మధ్యలో ఆపేశారు. ముందు ఒక ప్రాజెక్ట్ గానే చేయాలని అనుకున్నది కాస్త పాత్రలు ఎక్కువ అయ్యి వాటి ప్రభావం ఎక్కువ ఉండటంతో రెండు భాగాలుగా ఫిక్స్ అయ్యారు. కల్కి 2898 ఏడి సినిమా అంతా ఒక ఎత్తైతే చివరి ఎపిసోడ్ ఒక ఎత్తు. ముఖ్యంగా కర్ణుడిగా ప్రభాస్, అర్జునుడు గా విజయ్ దేవరకొండ రివీల్ అవ్వడం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
ఐతే కల్కి 2 ఎలా ఉండబోతుంది అన్నది మీ ఊహలకే వదిలేస్తున్నా అంటూ నాగ్ అశ్విన్ సస్పెన్స్ లో పెట్టాడు. అసలైతే కథ ప్రకారం చూస్తే అశ్వథ్ధామ, భైరవ కలిసి సుమతిని కాపాడాలి. అంటే ఇద్దరు కలిసి సుప్రీం యాస్కిన్ తో ఫైట్ చేయాలి. ఈ క్రమంలో భైరవ తను కర్ణుడు అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి.
లేటెస్ట్ గా కల్కి సినిమాపై నాని తన అభిప్రాయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. కల్కి 2 లో తాను ఉంటానని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పేశాడు. అంతేకాదు కల్కి లో కృష్ణుడిగా చేసింది తను కాదని చెప్పారు. కల్కి 2 లో అర్జునుడు, కర్ణుడు పాత్రలు కీలకం కానున్నాయని హింట్ ఇచ్చాడు నాని. అలా నాని ఇచ్చిన లీక్ ను బట్టి కల్కి 2 లో విజయ్ దేవరకొండ పాత్ర లెంగ్త్ ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది.
మరోపక్క సుప్రీం యాక్సిన్ పాత్ర కూడా సెకండ్ పార్ట్ లో ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది. సో కల్కి 2 లో అసలు కథ నడుస్తుంది. అంతేకాదు వెండితెర మీద మరోసారి కురుక్షేత్ర యుద్ధాన్ని చూపించబోతున్నాడు నాగ్ అశ్విన్. కల్కి 2 నెక్స్ట్ ఇయర్ జనవరిలో షూటింగ్ మొదలు పెడతామని ఆ సినిమా నిర్మాతలు చెబుతున్నారు.