Mahesh Babu Mufasa : ముఫాసాతో మహేష్.. రాజమౌళి సినిమా కన్నా ముందు హాలీవుడ్ ఎంట్రీ..!

సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. మహేష్ తో జక్కన్న హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉన్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా ఇది రాబోతుంది. ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటికే కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా పూర్తి స్థాయి మేకోవర్ తో వస్తున్నాడు. రాజమౌళి సినిమా కోసం మహేష్ దాదాపు 3 ఏళ్ల పాటు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో మిగతా కాస్టింగ్ ఎవరన్నది కూడా తెలియాల్సి ఉంది. ఐతే రాజమౌళి సినిమా కన్నా ముందే మహేష్ బాబు హాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. మహేష్ వాల్ట్ డిస్నీ వారు తెరకెక్కించిన ముఫాసా సినిమాకు పనిచేస్తున్నారు. ది లయన్ కింగ్ సీక్వెల్ గా వస్తున్న ముఫాసా సినిమాలో ముఫాసా పాత్రకు మహేష్ డబ్బింగ్ చెప్పారు.

దీనికి సంబందించిన ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజైంది. సింహం లాంటి గొంతుతో ముఫాసాకి డబ్బింగ్ చెప్పారు సూపర్ స్టార్ మహేష్. ఈ సినిమాతోనే ఆయన హాలీవుడ్ ప్రొడక్షన్ తో కొలాబరేట్ అవుతున్నారు. అంటే ముఫాసా సినిమాకు మహేష్ పనిచేస్తే తర్వాత రాజమౌళితో చేస్తున్న సినిమాకు వాళ్లు అక్కడ మహేష్ కు సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి సూపర్ స్టార్ ప్లానింగ్ అంటే ఇలానే ఉంటుందనిపించేలా మహేష్ అదరగొట్టాడు.

ది లయ కింగ్ సినిమాలో ముఫాసా కొడుకు సింబాకి అంతకుముందు నాని డబ్బింగ్ చెప్పాడు. ఇప్పుడు ముఫాసా కోసం ఏకంగా సూపర్ స్టార్ నే ఒప్పించారు. ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పినందుకు గాను మహేష్ కు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ అందినట్టు తెలుస్తుంది.

Leave a Reply

*