నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కళ్లు కాయలు కాచే దాకా ఎదురుచూస్తున్నారు. నందమూరి లెగసీని మోక్షజ్ఞ కూడా కొనసాగించేలా అంతా సంసిద్ధం తో వస్తున్నాడు. ఇప్పటికే అన్ని విధాలుగా రెడీ అయిన మోక్షజ్ఞ లుక్స్ విషయంలో కూడా జాగ్రత్త పడుతున్నాడు. త్వరలోనే వారసుడి లాంచింగ్ ఉంటుందని తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ హీరోగా సినిమా ప్లానింగ్ లో ఉంది.
ఈ సినిమాకు నిర్మాతగా బాలయ్య చిన్న కూతురు తేజశ్విని వ్యవహరిస్తుందని టాక్. అంటే తమ్ముడి తెరంగేట్రం సినిమా ఎలాగు చరిత్రలో నిలిచిపోతుంది కాబట్టి ఈ సినిమాకు నిర్మాతగా తను కూడా రికార్డ్ సృష్టించాలని చూస్తుందని తెలుస్తుంది. ఐతే ఇప్పటికే ప్రశాంత్ వర్మ చెప్పిన కథ ఓకే అవ్వగా త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెడతారని తెలుస్తుంది.
ఐతే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. తొలి సినిమాతోనే పాన్ ఇండియా అటెంప్ట్ అంటే అది మామూలు విషయం కాదు. కానీ అక్కడ ఉంది నందమూరి వారసుడు కాబట్టి అందుకు తగినట్టుగానే తొలి సినిమాతోనే నేషనల్ వైడ్ భారీ స్కెచ్ వేశారట బాలయ్య.
హనుమాన్ తో సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ కచ్చితంగా ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. మోక్షజ్ఞ తొలి సినిమా గురించి మిగతా డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.