Nani Saripoda Shanivaram Runtime Shock to Audience
న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సరిపోదా శనివారం. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దానయ్య డివివి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా సినిమాలో నానికి ప్రతి నాయకుడిగా ఎస్ జే సూర్య నటించారు. గురువారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ తో అంచనాలు పెంచాడు నాని. ఈమధ్యనే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక బస్తా పేపర్లు ఎక్కువే తీసుకెళ్లండి అని చెప్పాడు.
నాని సరిపోదా శనివారం మంచి కథ అంతకుమించి కథనంతో పర్ఫెక్ట్ ప్యాకేజ్ సినిమాతో వస్తుంది. ఈ సినిమాపై నాని చేస్తున్న ప్రమోషన్స్ అన్ని కూడా సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే అనిపిస్తున్నాయి. ఐతే సినిమా గురించి నాని చెప్పింది అంతా జరిగేలా ఉన్నా రన్ టైం విషయంలో మాత్రం ఫ్యాన్స్ కాస్త డౌట్ పడుతున్నారు.
నాని సరిపోదా శనివారం సినిమా 2 గంటల 40 నిమిషా రన్ టైం తో వస్తుంది. ఐతే వివేక్ తో నాని చేసిన అంటే సుందరానికీ సినిమా కూడా 3 గంటల రన్ టైం తో వచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ అదే అని కూడా చెబుతారు. కానీ ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాను కూడా 2 గంటల 40 నిమిషాల దాకా ఉంచారు.
మరి ఈ సినిమాకు రన్ టైం విషయంలో ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా చేస్తారా లేదా అన్నది చూడాలి. సినిమా కోసం నాని ఆన్ సెట్స్ ఎంత కష్టపడ్డాడో సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో కూడా అదే రేంజ్ లో కష్టపడుతున్నాడు. అందుకే నానికి మంచి సక్సెస్ లు అందుతున్నాయని చెప్పొచ్చు.