పక్కా క్లాస్ సినిమాలు తీసే వివేక్ ఆత్రేయ, తన స్క్రీన్ ప్లే మాయ జాలం తో మాస్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో సరిపోదా శనివారం తో చేసి చూపించాడు. నాని ఇంతకు ముందెన్నడూ చేయని యాక్షన్ , కథ తెలిసినదే అయినా కథనం, డైలాగులు మాత్రం సినిమా చూడటానికి వెళ్లిన ప్రతి సినిమా అభిమానికి మంచి సినీ అనుభవాన్ని మిగుల్చుతాయి.
సరిపోదా శనివారం ట్రైలర్ లోనే సినిమా కథని చెప్పేశారు. రాజమౌళి ఫార్ములాని కేవలం ట్రైలర్ తోనే కాకుండా సినిమా ఆసాంతం కథనంలో ఎమోషన్ ఏమాత్రం తగ్గకుండా పక్కా తన కలం బలాన్ని చూపించాడు వివేక్ ఆత్రేయ.
నాని , సూర్య ల పెర్ఫార్మన్స్ , జేక్స్ బిజోయ్ నేపధ్య సంగీతం , వివేక్ ఆత్రేయ స్క్రీన్ ప్లే బలాలు.
సినిమా రేటింగ్ : 4.25/5