ఏపీలో కొత్తగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఐతే సీఎం గా చంద్రబాబు తన అనుభవాన్ని అంతా ఏపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఇదిలాఉంటే ఒక హీరో కేవలం చంద్రబాబు అధికారం లో ఉంటేనే సినిమాలు చేస్తాడని అంటున్నారు. కొత్తగా తన సినిమా టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ హీరోకి ఈ ప్రశ్న కాస్త ఆశ్చర్యకరంగా అనిపించింది. ఇంతకీ ఎవరా హీరో ఎందుకు ఆయనతో చంద్రబాబుకి లింక్ పెట్టారు అంటే ఆ హీరో నారా వారాసుడు నారా రోహిత్ కాబట్టే అలాంటి డౌట్ రేజ్ చేశారు.
నారా చంద్రబాబు బ్రదర్ అయిన నారా రామ్మూర్తి నాయుడు కొడుకైన నారా రోహిత్ సినిమాల మీద ఉన్న ఇష్టంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఐతే ఇప్పటికీ కూడా అతను సరైన ఇమేజ్ సంపాదించలేదు. ఐతే నారా రోహిత్ చివరి సినిమా 2018 లో వచ్చింది. దాదాపు ఆరేళ్లుగా సినిమాలు చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు సుందరకాండ అనే సినిమాతో వస్తున్నాడు.
ఈ హీరో కేవలం పెదనాన్న చంద్రబాబు అధికారం లో ఉన్నప్పుడు మాత్రమే సినిమా చేస్తాడని మీడియా లో ఒక న్యూస్ వైరల్ అయింది. ఐతే దానికి తన నిర్మాతలకు ఆ విషయం ఎలా తెలుస్తుంది. సుందరకాండ మొదలైనప్పుడు ఇంకా ఫలితాలు రాలేదు. అలాంటిది ఏమి లేదు తాను ఒకవేళ పెదనాన్న రికమెండేషన్ వాడుకోవాలంటే పెద్ద డైరెక్టర్స్ తో సినిమా చేసే వాడినని తన సినిమాల బడ్జెట్ కూడా పెద్దగా ఎక్కువ ఉండదని. తన సినిమాలకు బ్లాక్ మనీ వాడుతున్నారన్నది కూడా కేవలం బురచల్లే ప్రయత్నమే అని అన్నారు నారా రోహిత్.
ప్రస్తుతం నారా రోహిత్ హీరోగా సుందరకాండ సినిమా వస్తుంది. ఈ సినిమాను వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్ట్ చేస్తున్నారు. నారా రోహిత్ సరసన శ్రీదేవి హీరోయిన్ గా నటిస్తుంది.