సూపర్ స్టార్ రజినికాంత్ లీడ్ రోల్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కూలీ. కమల్ హాసన్ ని తిరిగి సూపర్ ఫాం లోకి వచ్చేలా చేసిన విక్రం సినిమా డైరెక్టర్ గా లోకేష్ కి సూపర్ క్రేజ్ వచ్చింది. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ కూలీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అంటున్నారు. సూపర్ స్టార్ రజినికాంత్ కూలీ నుంచి ఆమధ్య వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
ఐతే సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఇప్పటికే రజిని కూలీలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఉన్నాడని తెలుస్తుండగా లేటెస్ట్ గా ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ ని కూడా రంగం లోకి దించారని తెలుస్తుంది. సూపర్ స్టార్ రజిని కోసం ఏకంగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ ని తీసుకొస్తున్నారని టాక్.
ఈమధ్య బాలీవుడ్ హీరోలకు సౌత్ సినిమాలు, సౌత్ డైరెక్టర్స్ మీద ఫోకస్ ఎక్కువైంది. అందుకే ఇక్కడ నుంచి వస్తున్న అవకాశాలను వాడుకుంటున్నారు. ఆమీర్ ఖాన్ కూడా సౌత్ ఆడియన్స్ కి దగ్గరయ్యే ఆలోచనతోనే రజిని సినిమాకు ఓకే అన్నట్టు తెలుస్తుంది. సూపర్ స్టార్ రజినికాంత్ కూలీ సినిమాలో ఉపేంద్ర, ఆమీర్ ఖాన్ ఇలా భారీ స్టార్ కాస్ట్ ఉండనుంది.
ఐతే ఇది చూస్తుంటే నెల్సన్ రజినితో చేసిన జలర్ సినిమా తరహాలోనే కూలీ సినిమాలో కూడా సర్ ప్రైజ్ క్యామియోలు ప్లాన్ చేస్తున్నట్టు ఉంది. అంతమందిని పెట్టి పర్ఫెక్ట్ స్టోరీ కుదిరితే ఓకే కానీ ఏదో వారి క్రేజ్ ని వాడుకోవాలని చూస్తే మాత్రం రిజల్ట్ తేడా వచ్చేస్తుంది.