అదేంటో ముందు నుంచి అల్లు హీరో అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ కాస్త రుస రుసలాడుతుంటారు. దానికి తగినట్టుగానే అతని ప్రవర్తన కూడా ఉంటుంది. ఒక నిర్మాత కొడుకుగా బన్నీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు కానీ కష్టపడి పనిచేస్తే అభిమానులు ఎంత ప్రేమ చూపిస్తారు అన్నది మామయ్య చిరంజీవిని చూసి తెలుసుకున్నాడు. అందుకే సినిమా సినిమాకు తను నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్స్ పెడుతూ ఈ స్థాయికి వచ్చాడు.
ఐతే తన కష్టం ఎంత పనిచేసిందో కెరీర్ మొదలో మెగా ఫ్యాన్స్ కూడా బన్నీని అంతే సపోర్ట్ చేశారు. ఐతే ఈమధ్య ఒక ఈవెంట్ లో హీరోలని చూసి హీరోలు అయ్యుంటారు కానీ నేను ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యానని అన్నాడు. అసలు ఏమాత్రం ఆమోద యోగ్యం కానీ ఆ డైలాగ్ వల్ల మెగా ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు.
ఇప్పటికే ఇంద్ర రీ రిలీజ్ లో శివాజి వెన్నుపోటు సీన్ అప్పుడు అల్లు అర్జున్ పేరు థియేటర్ మొత్తం మారుమోగింది. ఐతే ఈ వ్యవహారం మరింత ముదిరితే మాత్రం అల్లు అర్జున్ సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ సినిమాలను బాయ్ కాట్ చేస్తే ఆ హీరో పరిస్థితి ఏంటన్నది ఆలోచించాలి.
తనకంటూ కొంత ఫ్యాన్స్ ఉన్నారు.. దాన్ని ముద్దుగా ఆర్మీ అంటూ బన్నీ చెబుతుంటాడు. కానీ సినిమా హిట్ చేయాలంటే వారి సపోర్ట్ సరిపోతుందా.. ఇన్నాళ్లు ఏది ఎలా ఉన్నా అల్లు అర్జున్ కూడా మనవాడే అనుకున్న మెగా ఫ్యాన్స్ ఈసారి క్షమించేది లేదని అంటున్నారు. మరి డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ ఉన్నా ఏ ధైర్యంతో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ తలపడుతున్నాడన్నది ఎవరికి అర్ధం కావట్లేదు. వీరిమధ్య సంధి కుదిర్చే వారి కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.