ఇదే బెస్ట్ చాన్స్ అస్సలు మిస్ కావొద్దు!

ప్రపంచంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. ముఖ్యంగా భారతీయులకు బంగారం ఒక సెంటిమెంట్. పండగలు, పెళ్లిళ్లు ఇతర కార్యక్రమాలకు బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇక జ్యూలరీ షాప్స్ లో రక రకాల డిజైన్లు రావడంతో వాటిని కొనుగోలు చేసేందుకు మహిళలు ఇష్టపడుతున్నారు. బంగారం ఆభరణాలుగానే కాదు.. ఆర్థిక అవసరాలకు సెక్యూరిటీగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే మిడిల్ క్లాస్ వాళ్లు కూడా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల పసిడి, వెండి ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతూ.. అంతర్జాతీయ మార్కెట్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా భారీగా పెరిగి సుమారు 90 వేల స్థాయికి చేరిన పసిడి ధరలు ప్రస్తుతం స్పల్పంగా తగ్గుముఖం పట్టాయి. మార్చి 17న ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 82, 200 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం రేటు రూ. 89 వేల 670 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.82,340, 24 క్యారెట్ల ధర రూ.89,810 గ వద్ద కొనసాగుతుంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.82,190, 24 క్యారెట్ల ధర రూ.89,810 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.82,190, 24 క్యారెట్ల రేటు రూ.89,660 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.82,190 ఉండగా 24 క్యారెట్ల ధర రూ.89,660 వద్ద కొనసాగుతుంది. నేడుహైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.1,12,000 వద్ద ట్రేడవుతోంది. అంతకు ముందు వరుసగా మూడు రోజుల్లోనే రూ.5 వేలు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పు రావచ్చు ఆర్ధిక నిపుణులు అంటున్నారు.

గమనిక : అంతర్జాతీయ మార్కెట్ లో ఈ ధరలు ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేయడానికి ముందు మళ్లీ ధరలను తెలుసుకోవాలని సూచన