ఇద్దరు భర్తలు.. 2 మంగళసూత్రాలు

భారతదేశంలో వివాహ బంధానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ చట్ట ప్రకారం ఒక వ్యక్తి ఒకే జీవిత భాగస్వామిని మాత్రమే వివాహం చేసుకోవడానికి అనుమతి ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాకు చెందిన ఒక మహిళ తాను ఇద్దరు భర్తలతో నివసిస్తున్నానని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోను డిజిటల్‌భారత్563 అనే యూజర్ సోషల్ మీడియా సైట్‌లో షేర్ చేశారు. ఆమెను వివాహం చేసుకున్న వారు ఇద్దరూ అన్నదమ్ములు. ప్రస్తుతం ఈ ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఆమె ఇద్దరు పురుషులతో పాటు సిందూరంతో జుట్టును అలంకరించుకుని కనిపిస్తుంది. అంతేకాదు ఆమె మెడలో రెండు మంగళ సూత్రాలు కనిపిస్తున్నాయి. ఆ మహిళ మాట్లాడుతూ.. తాను ఇద్దరు భర్తలను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని తెలిపింది. తన మెడలో రెండు మంగళసూత్రాలు ఉన్నాయని చెప్పింది. మేము ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తాము, కలిసి ఉంటాము, కలిసి తింటాము, కలిసి నిద్రపోతాం అని ఆమె చెప్పింది. ముగ్గురం ఒకే ఇంట్లో ఉంటున్నామని చెప్పింది. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని.. సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నామని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ వీడియోలోని మహిళ తాను ఇద్దరు భర్తలతో నివసిస్తున్నానని చెప్పడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ వివాహ చట్టం దానికి అనుమతించదు. ఈ వీడియో కావాలని జనాల దృష్టిని ఆకర్శించడానికి చేశారని.. ఇది ఒక ఫ్రాంక్ అయి ఉండవొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా ఎక్కడైనా ఒక భర్త ఇద్దరు భార్యలు అన్నది వింటుంటారు.. కానీ ఇక్కడ అంతా రివర్స్ గా ఉంది. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఒక భార్య ఇద్దరు భర్తలు కి సంబంధించిన వీడియో విపరీతమైన వైరల్ అవుతుంది. మరీ ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.