భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, అమెరికన్ వ్యోమగాములు బుచ్ విల్మోర్ సహా మిగిలిన వ్యోగాములు తిరిగి భూమికి వచ్చేస్తున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వీరు భూమి పైకి మరి కొన్ని గంటల్లోనే రాబోతున్నారు. ఈ విషయంపై నాసా కీలక ప్రకటన చేసింది. NASA ప్రకటన ప్రకారం మార్చి 19, మంగళవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం 3:27 AM) వీరంగా భూమి పైకి అడుగు పెట్టనున్నారు. అయితే అమెరికా టైం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు వారు భూమిపై ల్యాండ్ కానున్నారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 2023 జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లారు. అయితే, బోయింగ్ నౌకలో తలెత్తిన ప్రొపల్షన్ సమస్యల కారణంగా వీరిద్దరినీ తిరిగి భూమికి తీసుకురావడం ఆలస్యమైంది. ఈ క్రమంలోనే సునితా విలియమ్స్ అరోగ్య పరిస్థితిపై రక రకాల కథనాలు వెలువడ్డాయి. అమె మరింత కాలం బతికే ఛాన్స్ లేదని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వాటన్నింటికి చెక్ పెడుతూ.. నాసా గుడ్ న్యూస్ చెప్పింది. సునీత, విల్మోర్‌ను తీసుకొచ్చేందుకు రెండ్రోజుల క్రితం ప్రయోగించిన స్పేస్ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ నిన్న (ఆదివారం) విజయవంతంగా అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. ‘క్రూ-10 మిషన్’లోని నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా ఐఎస్ఎస్‌లోకి ప్రవేశించారు దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్ ఈ సుదీర్ఘ ప్రయాణం కారణంగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురైనట్లు ఆమె ఫోటోలో చూస్తేనే అర్థమైంది. సాధారణంగా వ్యోమగాములు అంతరిక్షంలో ఉంటే వారి కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆమెకు మాత్రం కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ లేక చాలా కాలం గడపాల్సి వచ్చింది.. దీంతో ఆమె మానసికంగా చాలా ఆందోళన చెందినట్లు సమాచారం. ఆ సమయంలో ఇతర వ్యోమగాముల ఆమెకు అన్ని రకాలుగా సహకరించినట్లు తెలుస్తుంది.
ఇక సునితా విలియమ్స్ విషయానికి వస్తే.. అమెరికా లోని ఒహాయో రాష్ట్రం లో జన్మించింది. తండ్రి దీపక్ పాండ్య గుజరాత్ కి చెందినవాడు. తల్లి బోనీ జలోకర్ స్లోవేకియా దేశస్తురాలు. అమెరికా లోని నవల్ అకాడెమీలో ఫిజిక్స్ డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేసింది. 1998లో అంతరిక్ష యానం లో శిక్షణ తీసుకుంది. కల్పన చావ్లా తరువాత అంతరిక్షం లోకి వెళ్ళిన రెండవ మహిళ ఈమె. సునితా విలియమ్స్ ని అభిమానించే వారికి ఇది ఎంతో సంతోషకరమైన వార్త అంటున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.