పాక్ ఆర్మీకి చెందిన 214 బందీలు ఖతం? బీఎల్ఏ కీలక ప్రకటన! బలూచిస్తాన్ ఉద్యమం వెనుక అసలు కారణాలేంటి ?

పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లోని వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) జఫర్ ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

క్వెట్టా నుంచి పెషావర్‌ వస్తున్న జఫ్ఫార్‌ ఎక్స్‌ప్రెస్‌ను బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ హైజాక్‌ చేసింది. 400 మందిని తాము బంధించామని తిరుగుబాటు సంస్థ ప్రతినిధి జీయంద్ బలోచ్ ఒక ప్రకటనలో తెలిపాడు.

అయితే రైలులో ఉన్న పిల్లలను, మహిళలను మాత్రం విడిచపెట్టారు. రైల్వే ట్రాక్‌ను పేల్చి వేసిన తరువాత ఈ హైజాకింగ్‌కు పాల్పడ్డారు.

బలూచిస్తాన్‌ ప్రాంతానికి ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కోరుతున్న ఉగ్రవాద వేర్పాటువాద సంస్థ బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ, తాము బందీలుగా పట్టుకున్నది పాకిస్తాన్ సైనిక సిబ్బంది, పోలీసులు, యాంటీ-టెర్రరిజం ఫోర్స్, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ నుండి యాక్టివ్-డ్యూటీ సిబ్బంది ఇలా 214 మంది ఉన్నారని ఆ సంస్థ ప్రకటించింది. వీరందరూ సెలవుపై పంజాబ్‌కు వెళ్తున్న క్రమంలో ఈ హైజాక్‌ జరిగింది.

ఘటన తర్వాత వెంటనే పాకిస్తాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ఈ ఆపరేషన్ కి బెలూచ్ ఉద్యమకారులు పెట్టిన పేరు ‘ఆపరేషన్ డెర్రోయ్ ఇ బోలాన్’ అని పేరు పెట్టారు.
పాకిస్థాన్ వైమానిక దాడులు ఆపకపోతే బందీలను చంపేస్తామని బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ తీవ్రవాదులు హెచ్చరించారు. అంతేకాదు పాక్ ఆర్మీకి బెలూచ్ మిలిటెంట్స్ ఒక డిమాండ్ కూడా చేసింది.

మా వద్ద ఉన్న బంధీలను రిలీజ్ చేయాలంటే 48 గంటల్లో పాక్ ఆర్మీ అరెస్ట్ చేసిన బలోచ్ ఉద్యమ కారులు, ఆడవారు, పిల్లలను విడుదల చేయాలని కోరింది.

24 గంటల తర్వాత మరో మెయిల్ పంపించారు. కానీ పాక్ ఆర్మీ మాత్రం ఈ డిమాండ్ ఏమీ పట్టించుకోలేదు. అంతేకాదు బుధవారం పాక్ ఆర్మీ బలోచ్ మిలిటెంట్స్ స్థావరాలపై విరుచుకుపడ్డారు.

ఈ హైజాక్ ఆపరేషన్ ని 33 మంది బలోచ్ ఫైటర్స్ మొదలు పెట్టారు. వీరి యూనిట్ పేరు మజీగ్ బ్రుగెట్. ఈ 33 మంది తీవ్రవాదులు ఫుల్లుగా ట్రైనింగ్ తీసుకొని ఉన్నవారు. తాము బంధించిన 241 మంది బందీలను వివిధ ప్రదేశాలకు తరలించారు.

అయితే పాక్ సైన్యం మాత్రం బంధీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. అంతేకాదు పాక్ ఆర్మీ ఎస్ఎస్ జీ సైన్యాన్ని రంగంలోకి దింపింది.

ఎస్ఎస్ జీ సైనికులు కొండ లోయల్లో యుద్దం చేయడంలో బాగా చేయితిరిగిన వారు. పాక్ ఆర్మీ హెలికాప్టర్స్ ద్వారా జఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు చుట్టూ ఎస్ఎస్ జీ సైన్యాన్ని దింపింది.

ఇక బీఎల్ఎస్ ఫైటర్స్, ఎస్ఎస్ జీ ఆర్మీకి మధ్య భీకర కాల్పులు జరిగాయి. అయితే పాక్ ఆర్మీ తన బుద్ది పోనిచ్చుకోలేదు.. కేవలం 42 గంటల్లోనే రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేశామని, 33 మంది బెలూచ్ మిలిటెంట్స్ ని హతమార్చాడమే కాదు.. 214 మంది బందీలను ఆర్మీ రక్షించింద నేషనల్, ఇంటర్ నేషనల్ మీడియాను తప్పుదోవ పట్టించింది.

వాస్తవానికి బీఎల్ ఎస్ మిలిటెంట్స్.. ఎస్ఎస్ జీ ఆర్మీ చిత్తు చిత్తుగా ఓడించిందని కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి. మరోవైపు జాఫర్ ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ రైలు పట్టుబడిన 214 మంది బందీలను ఉరితీసినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పేర్కొంది.

బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఖైదీల మార్పిడి కోసం 48 గంటల అల్టిమేటం ఇచ్చినప్పటికీ పాకిస్తాన్ దళా లు స్పందించడంలో విఫలమయ్యాయని, ఫలితంగా సామూహిక ఉరిశిక్ష విధించబడిందని అన్నారు.

తాము ఎల్లప్పుడూ అంతర్జాతీయ చట్టాల ప్రకారమే నడుచుకున్నామని తిరుగుబాటు సంస్థ పేర్కొంది. ఇదిలా ఉంటే.. హైజాక్ జరిగిన వెంటనే జనరల్ జీడీ భక్షీ కొన్ని కీలక విషయాలు మాట్లాడారు.

పాకిస్థాన్ వద్ద హాస్టేజ్ రెస్క్యూ మిషన్స్ వంటివి ఏవీ లేవు. ఇక్కడ ఎలాంటి ట్రైన్డ్ యూనిట్ లేదు. పాకిస్థాన్ సైనికులు మిలిటెంట్స్ ని టార్గెట్ చేసుకునే క్రమంలో బంధీలను కూడా చంపే అవకాశం ఉందని అన్నారు.

ఈ సైన్యం ఎవరినీ లెక్కచేయరు.. ఎవరు అన్నది చూడరు కొలాట్రల్ డ్యామేజ్ చేసైనా సరే ఆపరేషన్ కొనసాగిస్తారని అన్నారు భక్షీ. హాస్టేజెస్ కి రక్షణ లేదు.. బీఎల్ఎస్ బలంగా ఉందని ముందే చెప్పారు. నిజంగానే ఆయన చెప్పిన విధంగానే జరిగింది.

పాక్ కి చెందిన ఎస్ఎస్ జి ఆర్మీకి ఎంట్రీ ప్లాన్.. ఎగ్జిట్ ప్లాన్ లేకుండా ఇష్టానుసారంగా తన దూకుడు కొనసాగించిందని అంటున్నారు. ఈ విషయాలు అన్ని బెలూచ్ స్పోక్ పర్సన్ జెఇ బలోచ్ చెప్పారు.

1973 నుండి 1977 వరకు స్వతంత్ర బలూచిస్తాన్ ఉద్యమం కొనసాగింది. పాకిస్థాన్ నుంచి స్వాతంత్రం కోసం బెలుచిస్థాన్ ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని గ్రూపులుగా ఏర్పడి పాక్ సైన్యంపై తిరుగుబాటు చేస్తున్నారు.

బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA)2000లో స్థాపించబడింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీలో గ్రాడ్యూయేట్స్, లాయర్లు, డాక్టర్లు, యుద్ద తంత్రం తెలిసిన సైనికులు ఉన్నట్లు ఆ సంస్థ చీఫ్ తెలిపారు.

బెలుచిస్థాన్ లో డీప్ సీ పోర్ట్ ఉంది. గ్వాదార్ వంటి అతిపెద్ద ఓడరేవు ఉంది. అంతేకాదు ఇక్కడ భూమిలో హైడ్రో కార్పన్స్, అరుదైన ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. బలోజ్ భూమి మొత్తాన్ని పాకిస్థాన్, చైనా దేశాలు దోచుకుతింటున్నాయి. చైనా గ్వాదార్ పోర్టును కొనుక్కొని పూర్తిగా ఆక్రమించుకుంది.

ఇక బెలుచ్ నుంచి వచ్చే ఆదాయం పాకిస్థాన్ అప్పలంగా తినేస్తుంది. ఇది సహించలేక 75 సంవత్సరాలుగా బలోచ్ ఉద్యమకారులు ఎన్నో రకాల ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ వస్తున్నారు.

చివరిగా జఫర్ ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసి పాక్ భద్రతా సిబ్బందిని బందీలుగా చేసినప్పటి నుంచి ఇంటర్ నేషనల్ స్థాయిలో బీఎల్ఏ కి గుర్తింపు వచ్చింది. విషయం ఏంటంటే.. హైజాక్ చేసిన రోజే ట్రైన్ లో ఉన్న ఆడవారు, చిన్న పిల్లలు, సామాన్య పౌరులను విడుదల చేశారు.

కేవలం పాక్ భద్రతా సిబ్బంది, ఆఫీసర్లను మాత్రమే బంధీలుగా చేశారు. అయితే పాక్ చేసిన హడావుడి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోయింది. అబద్దం చెప్పినా అతికినట్లు ఉండాలని పాక్ ఆర్మీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.